inter: మరో ఇంటర్ విద్యార్థి బలి.. గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

  • నేరేడ్ మెట్ కు చెందిన సాహిల్ ఆత్మహత్య
  • ఇంటర్ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం
  • పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న వైనం

 హైదరాబాద్ నేరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన సాహిల్ అనే విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సాహిల్ తండ్రి మాజీ ఆర్మీ ఉద్యోగి. ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తన తండ్రికి చెందిన గన్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకుని సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాహిల్ మరణంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఏ సమస్యకూ ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఎందరో చెబుతున్నా, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం... వారి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతోంది.

More Telugu News