Virat Kohli: కోహ్లీ సేనకూ ప్లే ఆఫ్ చాన్స్... ఎలాగంటే..!

  • ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఆర్సీబీ
  • అయినా సాంకేతికంగా ప్లే ఆఫ్ అవకాశం
  • మిగతా జట్ల ప్రదర్శనపై ఆధారపడ్డ కోహ్లీ సేన

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ఢిల్లీ కాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. ఇక మిగతా ఆరు జట్లలో రెండు జట్లు ప్లే ఆఫ్ కు వెళతాయి. ఈ ఆరు జట్లలో ముంబై ఇండియన్స్ ముందు నిలిచివున్నప్పటికీ, సాంకేతికంగా అన్ని జట్లకూ అవకాశం ఉంది. 12 మ్యాచ్ లను ఆడి, కేవలం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న బెంగళూరు దాదాపుగా నిష్క్రమించినట్టే అయినా, ఆ జట్టుకూ చాన్సుంది.

అది ఎలాగంటే, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోల్ కతా చేతిలో ఓడిపోయి, చెన్నైపై గెలవాలి. ముంబై ఇండియన్స్ జట్టు కోల్ కతా, సన్ రైజర్స్ లపై గెలవాలి. రాజస్థాన్ జట్టు బెంగళూరు చేతిలో ఓడిపోయి, ఢిల్లీపై గెలవాలి. ఆపై బెంగళూరు తన ఆఖరి మ్యాచ్ లో హైదరాబాద్ ను భారీ తేడాతో ఓడించాలి. అదే జరిగితే, కోల్‌ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లన్నింటికీ పన్నెండేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్ కు వెళుతుంది. నెట్ రన్ రేట్ బాగుంటే కోహ్లీ సేన వెళుతుంది.

More Telugu News