SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. రేపటి నుంచి మారనున్న నిబంధనలు

  • రుణాలు, డిపాజిట్లను రెపో రేటుతో అనుసంధానించనున్న ఎస్‌బీఐ
  • చౌకగా మారనున్న రుణాలు
  • డిపాజిట్లపై మాత్రం తగ్గనున్న వడ్డీ

భారతీయ స్టేట్ బ్యాంకు నిబంధనలు రేపటి నుంచి మారబోతున్నాయి. వినియోగదారులందరూ తప్పక తెలుసుకోవాల్సిన ఈ విషయాలను ఎస్‌బీఐ వెల్లడించింది. మే ఒకటో తేదీ నుంచి రుణాలు, డిపాజిట్లు రెపో రేటుతో అనుసంధానం కానున్నాయి. ఫలితంగా రుణ, రెపో రేటుతో డిపాజిట్ రేట్లను అనుసంధానించనున్న తొలి బ్యాంకుగా ఎస్‌బీఐ రికార్డులకెక్కింది. బ్యాంకు నిర్ణయంతో రుణాలు మరింత చౌకగా మారే అవకాశం ఉంది.

పొదుపు ఖాతా వినియోగదారులకు రేపటి నుంచి తమ డిపాజిట్లపై తక్కువ వడ్డీ లభించనుంది. లక్ష రూపాయలకు పైన ఉన్న డిపాజిట్లపై 0.25-0.75 శాతం తక్కువ వడ్డీ ఇవ్వనున్నట్టు ఇది వరకే ప్రకటించిన ఎస్‌బీఐ లక్ష రూపాయల వరకు ఉన్న డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ మాత్రమే ఇవ్వనుంది. ఆపైన డిపాజిట్లకు 3.25 శాతం వడ్డీ ఇవ్వనుంది.  రిజర్వు బ్యాంకు రెపో రేటు తగ్గింపు వల్ల ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించింది. అంటే ఇప్పుడీ రుణాలపై వడ్డీ రేటు  8.6-8.9 శాతం మధ్య ఉండనుంది.

More Telugu News