KA Paul: విద్యాశాఖా మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి: కేఏ పాల్

  • రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
  • విపక్షాల ఆందోళనకు మద్దతిస్తాం
  • కేసీఆర్ ఆలస్యంగా స్పందించడం తప్పు

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు అమీర్‌పేటలోని తన పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ మార్కుల అవకతవకలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బోర్డు అవకతవకలపై విపక్షాల ఆందోళనకు తమ పార్టీ మద్దతిస్తుందని, విద్యార్థులకు న్యాయం జరగకుంటే బోర్డు ఎదుట తాను ధర్నా చేస్తానని పాల్ హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలస్యంగా స్పందించడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. వెంటనే విద్యాశాఖా మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  

More Telugu News