USA: అమెరికాలో రెచ్చిపోయిన ఉన్మాది.. వీధిలో ఉన్న ప్రజలపై ఇష్టానుసారం కాల్పులు!

  • మేరిల్యాండ్ లోని బాల్టిమోర్ లో ఘటన
  • ఒకరి దుర్మరణం, ఏడుగురికి తీవ్రగాయాలు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
  • నిందితుడి కోసం గాలింపు ముమ్మరం

అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. మేరిల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ లో ఓ వీధిలో గుమిగూడిన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మరోవైపు ఈ విషయమై పోలీస్ కమిషనర్ హారిసన్ మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు(స్థానిక కాలమానం)  బాల్టిమోర్ లోని చర్చి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ కాల్పులకు, చర్చికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

More Telugu News