West Bengal: పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు కలకలం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

  • పశ్చిమబెంగాల్ లోని శాంతిపూర్ లో ఘటన
  • ఓ పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు దర్శనం
  • దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసిన అధికారులు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. ప్రజలంతా భారీగా క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లోని శాంతిపూర్ నియోజకవర్గంలో ఈరోజు నాటు బాంబు కలకలం చెలరేగింది. ఇక్కడి ఓ పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు దర్శనమివ్వడంతో ఎన్నికల అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఓటేసేందుకు వచ్చిన ప్రజలందరినీ బయటకు పంపించేశారు.

అనంతరం బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు బాంబును జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పశ్చిమబెంగాల్ పోలీసులు.. అసలు పోలింగ్ బూత్ లోకి బాంబు ఎలా వచ్చిందన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News