New Delhi: ఈ దఫా ఏకంగా ఎయిర్ పోర్ట్ సర్వరే డౌన్... వరుసగా మూడో రోజూ విమాన ప్రయాణికుల అవస్థలు!

  • శని, ఆదివారాల్లో ఎయిర్ ఇండియా సిస్టమ్ డౌన్
  • సోమవారం నాడు ఇమిగ్రేషన్ సిస్టమ్ సర్వర్ మొరాయింపు
  • గంటల తరబడి వేచి చూసిన ప్రజలు

శని, ఆదివారాల్లో ఎయిర్ ఇండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్, దాదాపు ఐదు గంటలపాటు మొరాయించి, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయగా, సోమవారం నాడు ఏకంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌ సర్వర్‌ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ తెల్లవారుజామున ఇమిగ్రేషన్‌ సిస్టమ్‌ సర్వర్‌ నిలిచిపోయింది. దీంతో చెక్‌ కోసం ప్రయాణీకులు గంటల తరబడి వేచిచూడాల్సి రాగా, ఈ సమస్యపై ఎయిర్ పోర్టులో బహిరంగ ప్రకటన చేసిన అధికారులు, మాన్యువల్‌ చెకింగ్‌ విధానంలో ప్రయాణికులను విమానాలు ఎక్కించారు.

 ఇక ఇమిగ్రేషన్ ఆలస్యం అవుతుండటంపై ఎంతో మంది సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను పెట్టారు. విమానాశ్రయంలోని క్యూలైన్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇండియాలోనే అత్యంత రద్దీగా ఉండే న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. దాదాపు 40 నిమిషాలకు పైగా సర్వర్ నిలిచిపోగా, దాని ప్రభావం ఈ ఉదయం 8 గంటల సమయంలోనూ సర్వీసులపై పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

More Telugu News