Sindhu Sharma: 18 నెలల తన కూతురిని తనకు అప్పగించాలని రిటైర్డ్ జడ్జి ఇంటి ఎదుట కోడలు సింధు ఆందోళన!

  • సొమ్మసిల్లి పడిపోయిన సింధు శర్మ
  • రామ్మోహనరావు ఇంటి వద్ద ఉద్రిక్తత
  • పాపకు పాలిచ్చేందుకు సింధుకి అనుమతి

18 నెలల తన కూతురితో పాటు తన పెద్ద బిడ్డను తనకు అప్పగించాలని కోరుతూ హైదరాబాద్‌లోని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు ఇంటి ముందు ఆయన కోడలు సింధు శర్మ, మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో సింధు శర్మ సొమ్మసిల్లి పడిపోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రామ్మోహనరావు ఇంట్లోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. చివరకు చైల్డ్ లైన్ ప్రతినిధులు రాగానే, పాపకు పాలిచ్చేందుకు సింధు ఇంట్లోకి వెళ్లారు. ఆరున్నరేళ్లుగా భర్త, అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ దాడికి పాల్పడ్డారని సింధు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు రామ్మోహనరావు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు.

More Telugu News