Phani cyclone: మరో 10 గంటల్లో పెరగనున్న ఫణి తుపాను తీవ్రత: విశాఖ వాతావరణ శాఖ

  • రాగల 12 గంటల్లో బలపడనున్న తుపాను
  • తమిళనాడు, కోస్తాంధ్ర సమీపంలో కేంద్రీకృతం
  • గంటకు 45-50 కి.మీ. వేగంతో గాలులు
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

మరో 10 గంటల్లో ఫణి తుపాను తీవ్రత పెరగనుందని, రాగల 12 గంటల్లో తుపాను బలపడి, తమిళనాడు, కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో కేంద్రీకృతం కానుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 30 నుంచి మే 1 వరకూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

తీరం వెంబడి గంటకు 45-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫణి తుపాను కారణంగా మే 2 నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

More Telugu News