Telangana: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఆవేదనగా స్పందించిన కేటీఆర్!

  • తెలంగాణలో 23 మంది విద్యార్థుల ఆత్మహత్య
  • కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజన్
  • ఆవేదనతో స్పందించిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా దాదాపు 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయమై ఓ నెటిజన్ కేటీఆర్ ను నేరుగా ప్రశ్నించారు. విక్రమ్ యాదవ్ అనే నెటిజన్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘కేటీఆర్ సార్ అన్నింటికి జవాబు ఇస్తున్నారు. ఇంటర్ పిల్లల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై నమ్మకాన్ని పోగొట్టకండి. మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేం నమ్ముతున్నాం’ అని ట్వీట్ చేశారు.

దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘నన్ను ఏం క్లారిఫికేషన్ ఇవ్వమంటారు సార్? మన రాష్ట్రంలో జరిగింది నిజంగా దురదృష్టకరమైన ఘటన. ఈ ఘటన వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. నేను ఓ తండ్రినే.. పిల్లలను కోల్పోయిన అమ్మానాన్నల బాధను అర్థం చేసుకోగలను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో ఓ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్న మరో నెటిజన్ సూచనకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News