varanasi: నిజామాబాద్‌ పసుపు రైతులకు వారణాసి అన్నదాతల ఆసరా

  • నామినేషన్‌ పత్రాలపై సంతకాలకు ముందుకు
  • మద్దతు ప్రకటించిన పలు రైతు సంఘాలు
  • ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు వెళ్లిన 45 మంది రైతులు

ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి లోక్‌సభ నియోకవర్గం నుంచి రెండోసారి బరిలో ఉన్న ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలుకు వెళ్లిన తెలంగాణలోని నిజామాబాద్‌ రైతులకు అక్కడి అన్నదాతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ నిరసనగా ప్రధానిపై పోటీకి శనివారం  45 మంది పసుపు పంట పండించే రైతులు వారణాసి చేరుకున్నారు.

అయితే వీరు నామినేషన్‌ వేయకుండా అక్కడి బీజేపీ కార్యకర్తలు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు, పోలీసులు ఇబ్బందుకు గురిచేయడంతో ప్రతిపాదకులుగా సంతకానికి ఎవరూ ముందుకు రాలేదు. దీన్ని గుర్తించిన అక్కడి రైతు సంఘాల నాయకులు తమ సభ్యులతో సంతకాలు చేయించేందుకు ముందుకు రావడంతో పసుపు రైతుల ప్రయత్నానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్టయింది.

కాగా, ఇప్పటికే వారణాసి నియోజకవర్గం నుంచి పోటీకి 60 మందికి పైగా నామినేషన్లు పత్రాలు అందించారు. పసుపు రైతులు 45 మందితోపాటు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన 8 మంది రైతులు, తమిళనాడు ఈరోడ్‌ ప్రాంతానికి చెందిన 15 మంది రైతులు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారి సంఖ్య వంద దాటుతుందని భావిస్తున్నారు.

More Telugu News