Nandya: ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలతో కలకలం!

  • నంద్యాల ఎంపీగా జనసేన తరఫున నిలిచిన ఎస్పీవై రెడ్డి
  • పరిశ్రమల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
  • తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుల ఫిర్యాదు

నంద్యాల ఎంపీ, ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు కలకలం రేపాయి. పరిశ్రమల స్థాపన పేరిట బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని, తిరిగి వాటిని చెల్లించలేదన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. రుణాలు ఎగ్గొట్టడంపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా, ఎస్పీవై రెడ్డి ఇంటికి వచ్చిన బెంగళూరు సీబీఐ అధికారులు, పలు పత్రాలను పరిశీలించారు. నంది పైపుల పరిశ్రమకు చెందిన ఉన్నతోద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాలపై ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు, నంది పైపుల ప్రతినిధులు స్పందించలేదు. కాగా, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న వేళ అస్వస్థతకు గురైన ఎస్పీవై రెడ్డి, ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

More Telugu News