Elections: ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ‘జీరో’: జస్టిస్ ఈశ్వరయ్య

  • ఆర్ఎస్ఎస్ అండ లేకపోతే బీజేపీ గెలవలేదు
  • భావజాలం వల్లే బీజేపీ బతికి బయటపడుతోంది
  • ఇచ్చిన హామీల్లో 50 శాతం కూడా ఏ పార్టీ అమలు చేయట్లేదు 

ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ‘జీరో’ అని, దాని అండ లేకపోతే బీజేపీ గెలవలేదని జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు చేశారు. ‘ఎలక్షన్ ఫండింగ్- ఖర్చుల్లో పారదర్శకత’ అంశంపై నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ, భావజాలం కారణంగానే బీజేపీ బతికి బయటపడుతోంది కానీ లేకపోతే ఎప్పుడో పతనమయ్యేదని అన్నారు. మేనిఫెస్టోలో హామీలను ఏ పార్టీ 50 శాతం కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. భవిష్యత్ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రజలను కొనే స్థితిలో ఉండలేదని, ఇప్పుడు రెండు వేలు లేదా ఐదు వేలు ఇస్తున్నారనుకోండి, ముందు ముందూ పదివేలు, పదిహేను వేలు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు వస్తే ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేరని అభిప్రాయపడ్డారు. కనుక, పార్టీల పంథాతో పాటు పౌర సమాజం కూడా మేల్కోవాలని సూచించారు.

More Telugu News