Srikakulam District: యువ‌త‌, మ‌హిళ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగులు ‘జ‌న‌సేన’కు అండ‌గా నిల‌బ‌డ్డారు: మాదాసు గంగాధరం

  • జ‌న‌సైనికులు అంటే పవన్ కల్యాణ్ కి ప్రాణం
  • ఏ పార్టీలోనైనా చిన్న‌చిన్న విభేదాలు సహజం
  • స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన విజయం సాధించాలి

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని, యువ‌త‌, మ‌హిళ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగులు జ‌న‌సేన పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డారని జ‌న‌సేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తెలిపారు. శ్రీకాకుళంలోని ఎస్.వి.ఎ. గ్రాండ్ హోట‌ల్ లో శ్రీకాకుళం పార్ల‌మెంట‌రీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన ముఖ్యనేతలు హాజరయ్యారు. పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్థుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ, ‘జ‌న‌సైనికులు అంటే అధ్య‌క్షుల వారికి ప్రాణం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మీరు ప‌డ్డ శ్ర‌మ‌కు కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికే మమ్మల్ని ఇక్క‌డికి పంపించారు. ఏ పార్టీలోనైనా చిన్న‌చిన్న విభేదాలు సహజం. వాటిని ప‌క్క‌న పెట్టి పార్టీ బ‌లోపేతం, భ‌విష్య‌త్తు కార్యా‌చ‌ర‌ణ‌పై దృష్టిపెడదాం. రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌తి గ్రామంలో జ‌న‌సేన విజయం సాధించాలి. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రికి పార్టీ త‌గిన గుర్తింపు ఇస్తుంది’ అని తెలిపారు. అనంతరం, పవన్ రాజకీయ సలహాదారుడు పి.రామ్మోహన్ రావు, పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీ పి.హ‌రిప్ర‌సాద్ మాట్లాడారు.

More Telugu News