Eletions: మొదటి ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ తనకు ఓటెయ్యమని అడగలేదు: జస్టిస్ ఈశ్వరయ్య

  • నెహ్రూ ప్రసంగాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది
  • రెండో ఎన్నికలప్పుడు తనకు ఓటెయ్యమని అదే నెహ్రూ అడిగారు
  • డబ్బులిచ్చినంత మాత్రాన ఓటర్ల నిర్ణయం మారదు

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగాలను పరిశీలిస్తే తనకు ఓటు వేయమని ఒక్క మీటింగ్ లో కూడా ఆయన అడగలేదని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ‘ఎలక్షన్ ఫండింగ్- ఖర్చుల్లో పారదర్శకత’ అంశంపై నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ చర్చలో పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ, రెండో ఎన్నికలు వచ్చేటప్పటికి అదే నెహ్రూ తనకు ఓటెయ్యమని ప్రజలను కోరారని అన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎన్ని మార్పులు జరిగాయో అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టినంత మాత్రాన వారి నిర్ణయం మారదని అన్నారు. రాజకీయ పార్టీల నిర్మాణం సరైన పద్ధతిలో జరగట్లేదని అన్నారు.

More Telugu News