Hyderabad: హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు!

  • నైజీరియన్ జాన్ పాల్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
  • గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలింపు
  • నిందితుడి నుంచి కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం

హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు సీపీ అంజన్ కుమార్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నైజీరియన్ జాన్ పాల్ ఓనే బుచిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. 2008లో విజిటింగ్ వీసాపై కేరళకు ఓనే బుచి వచ్చాడని, తర్వాత 2015లో హైదరాబాద్ కు వచ్చాడని చెప్పారు.

 టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని గోవాలో కొకైన్ విక్రయించేవాడని, గోవా తర్వాత హైదరాబాద్ లో విక్రయాలను ప్రారంభించాడని తెలిపారు. 2016లో గోవా పోలీస్ స్టేషన్ లో ఓనే బుచిపై పలు డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయాలు ప్రారంభించాడని చెప్పారు. డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఇక్కడ పోలీసులు పట్టుకున్నారని అన్నారు. నిందితుడి నుంచి 20 గ్రాముల కొకైన్, 9 ఎండీఎంఏ, వెయింగ్ మిషన్, లాప్ ట్యాప్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు అంజన్ కుమార్ పేర్కొన్నారు.

More Telugu News