lawrence: తెలుగు రాష్ట్రాల్లో లాభాల బాట పట్టిన 'కాంచన 3'

  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
  • ఫుల్ రన్ లో 25 కోట్లు రాబట్టే ఛాన్స్ 
  • 'జెర్సీ' వసూళ్లపై ప్రభావం  

తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్ కథానాయకుడిగా 'కాంచన 3' తెరకెక్కింది. ఈ నెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి అవలీలగా చేరిపోయింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు విడుదల చేశారు. 16 కోట్లకి ఆయన ఈ సినిమాను కొనుగోలు చేసినట్టుగా చెప్పుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మొదట్లో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో, ఠాగూర్ మధుకి పెద్ద మొత్తంలో నష్టాలు తప్పకపోవచ్చని అనుకున్నారు.

కానీ 'కాంచన 3' రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలివారంలోనే 16 కోట్లను వసూలు చేసింది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 25 కోట్లకి పైగా వసూలు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా చూపిన ప్రభావం కారణంగానే 'జెర్సీ' వసూళ్లు ఆశించినస్థాయిలో లేకపోవడానికి కారణమని చెప్పుకుంటున్నారు.

More Telugu News