బీజేపీలో చేరిన ఏడుగురు మాజీ సైనికాధికారులు

27-04-2019 Sat 16:21
  • మాజీ సైనికాధికారులకు స్వాగతం పలికిన సీతారామన్
  • అధికారుల సేవలను కొనియాడిన రక్షణమంత్రి
  • బీజేపీలో కొనసాగుతున్న చేరికలు
లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో కూడా బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటున్నాయి. సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు, అధికారులు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా ఈరోజు ఏడుగురు మాజీ సైనికాధికారులు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో వీరికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సాదర స్వాగతం పలికారు.

బీజేపీలో చేరిన వారిలో లెఫ్టినెంట్ జనరల్ జేబీఎస్ యాదవ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే పల్యాల్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఎన్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ సుతిల్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కోహ్లి, కల్నల్ ఆర్కే త్రిపాఠి, వింగ్ కమాండర్ నవనీత్ మగాన్ లు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సాయుధ దళాల్లో వీరు చేసిన సేవలను కొనియాడారు.