ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కంటే చంద్రబాబే అర్హుడు!: ఎన్సీపీ అధినేత శరద్ పవార్

- విపక్షాల కూటమిలో మాయావతి, మమత ముందున్నారు
- ఫలితాలు వచ్చాకే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం
- ముంబైలో మీడియాతో మాట్లాడిన నేత
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం మాయావతి ముందువరుసలో ఉంటారని అభిప్రాయపడ్డారు. ఏదేమయినా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తాము ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.