mujra party: గంజాయి, హుక్కాతో ముజ్రా పార్టీ.. పట్టుబడిన యువతుల్లో ఓ జూనియర్ ఆర్టిస్ట్

  • పహడిషరీఫ్ పీఎస్ సమీపంలోని ఫాంహౌస్ లో పార్టీ
  • గంజాయి, హుక్కా, మత్తు పదార్థాలు స్వాధీనం
  • ఇద్దరు అమ్మాయిలు, 18 మంది యువకుల అరెస్ట్

హైదరాబాదులో మరో ముజ్రా పార్టీ జరిగింది. పహడిషరీఫ్ పరిధిలో ఈ పార్టీ జరిగింది. పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న ఫాంహౌస్ లో ఈ పార్టీ జరగడం గమనార్హం. నదీం అహ్మద్ అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు. గంజాయి, హుక్కా, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతుల్లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టు సమాచారం. 

More Telugu News