TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు!: హరీశ్ రావు ట్వీట్

  • టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ వేడుకలు నేడు
  • ట్విట్టర్ లో స్పందించిన మాజీ మంత్రి
  • ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలని ఆకాంక్ష

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు స్పందించారు. టీఆర్ఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలని ఆకాంక్షించారు.

ఈరోజు ట్విట్టర్ లో హరీశ్ స్పందిస్తూ..  ‘గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి’ అని ట్వీట్ చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించిన నేపథ్యంలో తీసిన ఓ ఫొటోను హరీశ్ ఈ సందర్భంగా ట్వీట్ కు జతచేశారు.

More Telugu News