Hansika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కామెడీ ప్రధాన చిత్రంలో హన్సిక 
  • పెరిగిపోయిన 'మహర్షి' నిడివి 
  • ఏఆర్ రెహ్మాన్ కొత్త ప్రయత్నం

*  సందీప్ కిషన్, హన్సిక జంటగా తెలుగు, తమిళ భాషల్లో 'తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్' పేరిట ఓ హాస్య ప్రధాన చిత్రం రూపొందుతోంది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవై శాతం పూర్తయింది. మే 7న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు.    
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం నిడివి చాలా ఎక్కువ ఉందన్న వార్తలు వస్తున్నాయి. 2 గంటల 55 నిమిషాలకు చిత్రం నిడివి చేరిందని తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
*  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా మారి '99 సాంగ్స్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి తాను సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా ఇందులోని పాటలను కూడా ఆయనే రాస్తున్నాడు. ఇక ఈ చిత్రం ద్వారా ఎహాన్ భట్ అనే యువకుడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు.

More Telugu News