Uttar Pradesh: నాకే కనుక అధికారం ఉండి ఉంటేనా?.. మళ్లీ నోరు పారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్

  • వందేమాతరం పాడని వారికి ఇక్కడ నివసించే హక్కు లేదు
  • వారందరినీ పాకిస్థాన్ పంపించాలి
  • వందేమాతర గీతాన్ని ఉర్దూలోకి అనువదించాలి

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మళ్లీ నోరుపారేసుకున్నారు. దేశంలో నివసించే వారందరూ తప్పకుండా వందేమాతరం పాడాల్సిందేనన్న ఆయన అది పాడని వారికి ఇక్కడ నివసించే హక్కులేదని, వారిని పాకిస్థాన్ పంపించేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకే కనుక అధికారం ఉండి ఉంటే వందేమాతరం పాడని వారిని వారం రోజుల్లోనే పాకిస్థాన్ పంపించి ఉండేవాడినన్నారు. వందేమాతర గీతం పాడని వారని, భారత్ మాతా కీ జై అనని వారిని ఎలా క్షమిస్తామని ఎదురు ప్రశ్నించారు. సంస్కృతంలో ఉన్న వందేమాతర గీతాన్ని ఉర్దూలోకి అనువదించాలని డిమాండ్ చేశారు.

కాగా, సరేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్తకాదు. గతంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీపై నోరు జారారు. మన దేశంలో హర్యాన్వీ డ్యాన్సర్ సప్నాసింగ్ ఎలాగో, ఇటలీ సోనియా కూడా అంతేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

More Telugu News