ఏపీలో మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల..ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి: వర్మ

Fri, Apr 26, 2019, 08:57 PM
  • ఎన్నికల నేపథ్యంలో ఆగిన విడుదల 
  • ఎట్టకేలకు తొలగిన అడ్డంకులు  
  • ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులతో ఉన్న పోస్టర్ పోస్ట్
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను కోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఏపీలో మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న ఆంధ్రప్రదేశ్ లో విడుదల కానుందని, ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి అంటూ వర్మ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.‘యన్.టి.ఆర్. అనుభవించిన నరకం!’ అంటూ పోస్ట్ చేసిన పోస్టర్ పై ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు పాత్రధారులు ఉన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad