INS Vikramadithya: ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం... నేవీ అధికారి దుర్మరణం

  • కర్ణాటకలోని కార్వార్ హార్బర్ వద్ద ఘటన
  • దట్టమైన పొగ అలముకుని స్పృహ కోల్పోయిన అధికారి
  • ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేని వైనం

భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహకనౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ నేవీ అధికారి మృతి చెందారు. ఈ యుద్ధనౌక కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ప్రవేశిస్తుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో, సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉండగా, దట్టమైన పొగ అలముకుంది. ఓ అధికారి పొగ కారణంగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆయన కాసేపటికే స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ అధికారి ప్రాణాలను కాపాడలేకపోయారు.

అంతకుముందు, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు ఇతర భాగాలకు వ్యాపించలేదు. ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

More Telugu News