karthikeya: కార్తికేయ కొత్త సినిమాకి డిఫరెంట్ టైటిల్

  • కార్తికేయ తాజా చిత్రంగా 'హిప్పీ'
  • తదుపరి చిత్రం అర్జున్ జంధ్యాలతో 
  • సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్  

'ఆర్ ఎక్స్ 100'తో హీరోగా కార్తికేయకి మంచి క్రేజ్ వచ్చింది. ఆయనతో సినిమాలు చేయడానికి యువ దర్శకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక చాలామంది నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తికేయ తన సినిమాలు టైటిల్ దగ్గర నుంచి కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు.

అలా ప్రస్తుతం 'హిప్పీ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే కార్తికేయ మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'గుణ 369' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాకి సంగీతాన్ని అందించిన చైతన్ భరద్వాజ్, ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News