Telangana: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు.. నివేదిక అందజేయనున్న త్రిసభ్య కమిటీ

  • తెలంగాణ సీఎస్ కు అందజేయనున్న నివేదిక
  • మూడు రోజులుగా విచారణ చేసిన కమిటీ
  • ఇంటర్ బోర్డు, ‘గ్లోబరినా’ తప్పిదాలను గుర్తించిన కమిటీ

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిమిత్తం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు, గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తించింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ అందజేయనుంది. తెలంగాణ సీఎస్ జోషికి ఈ నివేదిక అందజేస్తుందని సమాచారం.

కాగా, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ నిశాంక్, ప్రొఫెసర్ వాసన్ ఉన్నారు.  ఈ వ్యవహారానికి సంబంధించి  మూడు రోజులుగా విచారణను కమిటీ చేపట్టింది. నిన్న రాత్రి 8 గంటలకు నివేదికను పూర్తి చేసింది. ఈ నివేదికను కొద్ది సేపట్లో ప్రభుత్వానికి సమర్పించనుంది.

More Telugu News