sharwanad: 'ఇక నీదే బాధ్యత' అంటూ ఆ దర్శకుడికి వదిలేసిన దిల్ రాజు

  • తమిళంలో హిట్ కొట్టిన '96'
  • తెలుగు రీమేక్ లో మార్పులు చెప్పిన దిల్ రాజు
  • సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత

క్రితం ఏడాది తమిళంలో భారీ విజయాలను సాధించిన సినిమాల జాబితాలో '96' ఒకటిగా కనిపిస్తుంది. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ కథ నచ్చడంతో తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శర్వానంద్ - సమంత జంటగా తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తోనే రీమేక్ ను ప్లాన్ చేశారు.

అయితే కథలో దిల్ రాజు కొన్ని మార్పులు చెప్పారట. అలా మార్చడం వలన 'ఆత్మ' దెబ్బతింటుందని చెప్పేసి ఆ దర్శకుడు నిరాకరించాడట. సంగీత దర్శకుడిగా దేవిశ్రీని తీసుకుందామని దిల్ రాజు అంటే, ఆల్రెడీ తమిళంలో చేసిన గోవింద్ వసంతనే తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు అన్నాడట. దాంతో 'నాకు కావలసింది హిట్ .. ఇక నీదే బాధ్యత' అంటూ దిల్ రాజు ఆ దర్శకుడికి స్వేచ్ఛను ఇచ్చారట. ఈ రీమేక్ ఇక్కడ ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి మరి. 

More Telugu News