ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న విమానం వెనక్కి

26-04-2019 Fri 11:52
  • ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో వెళ్తుండగా ఘటన
  • ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన రాహుల్‌ 
  • ఈరోజు సభలు కాస్త ఆలస్యమవుతాయని వివరణ
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గాల్లోకి లేచిన తర్వాత ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో పైలట్‌ విమానాన్ని వెనక్కి మరల్చాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. లోక్‌సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీహార్‌లోని పాట్నాకు రాహుల్‌ బయలుదేరారు. ఢిల్లీ నుంచి బయుదేరిన కాసేపటికి విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్‌ విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. తిరిగి విమానం బయలుదేరేందుకు కాస్త సమయం పడుతుందని, అందువల్ల ఈరోజు బీహార్‌లోని సమస్తిపూర్‌, ఒడిశాలోని బాలాసోర్‌, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కాస్త ఆస్యంగా జరుగుతాయని, అభిమానులు సహకరించాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.