ప్రాణాల మీదకు తెచ్చిన ఆట సరదా.. పార్క్‌లో బాలుడి మృతి

Fri, Apr 26, 2019, 11:01 AM
  • సిమెంట్‌ బెంచ్‌ మీద పడడంతో ఘటన
  • కదులుతున్న బెంచ్‌పై ఊయలలా ఆట
  • పట్టుతప్పి మీద పడడంతో తలకు గాయమై మృతి
ఆ పిల్లాడి ఆట సరదా అతని ప్రాణాల మీదికి తెచ్చింది. అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. పార్క్‌లో కదులుతున్న బరువైన సిమెంట్‌ బెంచ్‌ మీద పడడంతో బాలుడి తలకు తీవ్రగాయమై చనిపోయాడు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో జనప్రియ అపార్ట్‌మెంట్‌ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.  స్థానికుడైన బిశాన్‌ శర్మ అనే ఆరేళ్ల బాలుడు పార్క్‌లోని ఓ సిమెంట్‌ బెంచ్‌పై కూర్చుని ఊగుతున్నాడు. అప్పటికే కొంత దెబ్బతిని ఉన్న బెంచ్‌ ఊగుతుండడంతో ఉత్సాహం వచ్చిన బిశాన్‌శర్మ ఊయలలా గట్టిగా ఊగడం మొదలుపెట్టాడు. కాసేపటికి బెంచ్‌కి ఉన్న ఆధారం విరిగిపోయి ఊడిపోయింది. దీంతో బాలుడు ముందుకు పడిపోగా, అతనిపై బెంచ్‌ పడింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయం కావడంతో బిశాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, పార్క్‌ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad