Telugudesam: ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సుజనా చౌదరి

  • సీబీఐ జారీ చేసిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీవి
  • 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఏ హోదాలోనూ లేను
  • తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నా

సీబీఐ తనకు పంపిన సమన్లపై టీడీపీ నేత సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సీబీఐ జారీ చేసిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీకి చెందినవని, ఈ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాల్లో లేనని అన్నారు. 2003 నుంచి 2014 వరకు మూడు లిస్టెడ్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నానని అన్నారు. ఆ మూడు కంపెనీలు సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, నియాన్ టవర్స్ అని చెప్పిన సుజనా చౌదరి, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

More Telugu News