Inter: ఫెయిల్ అయిన అమ్మాయికి కలెక్టర్ చొరవతో రీ వాల్యుయేషన్.. 951 మార్కులతో ఉత్తీర్ణత!

  • ఫిజిక్స్‌లో 14 మార్కులే వచ్చాయి
  • రీ వాల్యుయేషన్ చేయించిన కలెక్టర్
  • పాస్ అయినట్టు ఆన్‌లైన్ ద్వారా మెమో

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు ఇప్పటికీ బయట పడుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ విద్యార్థినికి ఒక సబ్జెక్టులో సున్నా మార్కులు రాగా అనంతరం రీ వెరిఫికేషన్‌‌లో 99 మార్కులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఉదంతం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం, ముచ్చింతల గ్రామానికి చెందిన కేఎం గ్రేసీ బైపీసీ గ్రూప్ తో చదివింది.

ఆమెకు ఇంటర్ మార్కులు మొత్తం కలిపి 921 రాగా, ఫిజిక్స్‌లో మాత్రం 14 మార్కులే వచ్చాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో గ్రేసీకి ఫిజిక్స్‌లో 60కి 60 మార్కులు రాగా సెకండియర్‌లో కనీసం పాస్ కూడా కాకపోవడంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడిన కలెక్టర్ రీ వాల్యుయేషన్ చేయించగా గ్రేసీకి 44 మార్కులు వచ్చాయి. మొత్తం 951 మార్కులతో గ్రేసీ పాస్ అయినట్టు ఆన్‌లైన్ మెమో ద్వారా ధ్రువీకరించారు.

More Telugu News