surya: అద్భుతమైన లొకేషన్లో సూర్య, సాయేషా సైగల్ పై పాట చిత్రీకరణ

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య 
  • యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • ఆగస్టు 30వ తేదీన విడుదల  

ప్రస్తుతం సూర్య 'కాప్పాన్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.  ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా సాయేషా సైగల్ నటిస్తోంది.

ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఒక పాటను జావా ఐస్ ల్యాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట .. ఆడియన్స్ కి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, మోహన్ లాల్ .. బొమన్ ఇరాని .. ఆర్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో సూర్య వున్నాడు. 

More Telugu News