maruti suzuki: డీజిల్ కార్లపై కీలక నిర్ణయం తీసుకున్న మారుతి

  • డీజిల్ కార్లకు పెద్దగా లేని డిమాండ్
  • 2020 ఏప్రిల్ 1 నుంచి డీజిల్ కార్ల అమ్మకాల నిలిపివేత
  • అన్ని మోడళ్లను బీఎస్6కు అప్ గ్రేడ్ చేయనున్న మారుతి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక ప్రకటనను వెలువరించింది. వచ్చే ఏడాది నుంచి డీజిల్ కార్లను అమ్మబోమని ప్రకటించింది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి డీజిల్ కార్లను అమ్మకూడదనే నిర్ణయం అమల్లోకి వస్తుందని మారుతి ఛైర్మన్ భార్గవ తెలిపారు. డీజిల్ కార్లకు డిమాండ్ పెద్దగా లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. అయితే 1500సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ కార్లను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 1500సీసీ డీజిల్ వాహనాలకు భవిష్యత్తు ఉందని... మార్కెట్ డిమాండ్ ను బట్టి డీజిల్ వాహనాలను ఉత్పత్తి చేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.

2020 మార్చి 31 లోగా బీఎస్4 గ్రేడ్ వాహనాలను క్లియర్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు... అప్పటి లోగా అన్ని కార్లను అమ్మేస్తామని మారుతి తెలిపింది. అన్ని మోడళ్లను బీఎస్6కు అప్ గ్రేడ్ చేస్తామని చెప్పింది.

More Telugu News