Andhra Pradesh: మోహన్ బాబూ.. తెలంగాణలో ఇంటర్ పిల్లల చావులు కనిపించడం లేదా?: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్

  • టీటీడీ బంగారం తరలింపు బ్యాంకుల బాధ్యత
  • కేంద్ర ప్రభుత్వంపై మాకు అనుమానం ఉంది
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బంగారం తరలింపుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్వామివారి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుందనీ, అయితే బంగారాన్ని తరలించడం, తిరిగి వెనక్కి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయనీ, అందువల్ల తమకు ఈ బంగారం తరలింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపైనే అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అధికారాలు లేవని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులు చనిపోతుంటే మోహన్‌బాబుకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఈ విషయంలో మోహన్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. ఈవీఎంలపై ఈసీ వైఖరి మారాల్సిన అవసరముందని రాజేంద్రప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

More Telugu News