jamuna: 30 ఏళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు జమున

  • సెట్స్ పైకి దేవినేని నెహ్రు బయోపిక్
  • ప్రధానమైన పాత్రలో తారకరత్న 
  • ప్రత్యేకమైన పాత్రలో జమున  

తెలుగు చిత్రపరిశ్రమలో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఆ క్రమంలోనే 'దేవినేని నెహ్రు' బయోపిక్ ను రూపొందిస్తున్నారు. 'దేవినేని' అనే టైటిల్ ను ఖరారు చేసి, 'బెజవాడ సింహం' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ప్రధానమైన పాత్ర కోసం తారకరత్నను తీసుకున్నారు. శివనాగు దర్శకత్వం వహించే ఈ బయోపిక్ ద్వారా అలనాటి అందాల కథానాయక జమున రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ .. "దర్శకుడు శివనాగు నాకు దత్తపుత్రుడు లాంటివాడు. ఈ సినిమాలో నేను తప్పకుండా చేయవలసిందేనని ఆయన పట్టుబట్టడంతో కాదనలేకపోయాను. ఆయన వినయ విధేయతలు .. క్రమశిక్షణ నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి మరో కారణం. 30 ఏళ్ల తరువాత మళ్లీ నాతో మేకప్ వేయించిన ఘనత శివనాగుకే చెందుతుంది. ప్రధానమైన పాత్రను పోషిస్తున్న తారకరత్నకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News