Mahesh Babu: 'మహర్షి'లో మహేశ్ అదరగొట్టేశాడు .. కన్నీళ్లు పెట్టించాడు: జయసుధ

  • 'మహర్షి' చాలా గొప్ప సినిమా 
  • ప్రకాశ్ రాజ్ భార్యగా కనిపిస్తాను 
  • మహేశ్ అద్భుతంగా చేశాడు  

మహేశ్ బాబు తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మహర్షి' సిద్ధమవుతోంది. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి .. మహేశ్ బాబు నటన గురించి జయసుధ మాట్లాడారు. " విజయనిర్మల గారికి నేను బంధువును కావడం వల్లన కృష్ణగారి కుటుంబసభ్యులతో నాకు మంచి అనుబంధం వుంది. మహేశ్ బాబును బాల నటుడి నుంచి చూస్తున్నాను.

ఆయనతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' .. 'బ్రహ్మోత్సవం' చేశాను. 'మహర్షి'లో ప్రకాశ్ రాజ్ భార్యగా కనిపిస్తాను. ఈ సినిమాను దర్శకుడు చాలా గొప్పగా తెరకెక్కించాడు. మహేశ్ బాబు చాలా బాగా చేశాడు. రెండు సీన్లలో ఆయన నటన చూస్తూ .. నా పాత్ర వైపు నుంచి ఇవ్వాల్సిన రియాక్షన్స్ ఇవ్వకుండా వుండిపోయాను. ఆ సీన్లలో నిజంగానే మహేశ్ బాబు నాకు కన్నీళ్లు తెప్పించాడు. ఆయన నటనకి అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News