samanta: వరుస హిట్లతో పారితోషికం పెంచేసిన సమంత?

  • తమిళంలో 'సూపర్ డీలక్స్' హిట్
  •  తెలుగులో 'మజిలీ' ఘనవిజయం
  •  డిమాండ్ చేస్తోన్న పారితోషికం 3 కోట్లు

సమంత కొంతకాలంగా తెలుగు .. తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన దూకుడును కొనసాగిస్తోంది. ఇటీవల తమిళంలో ఆమె చేసిన 'సూపర్ డీలక్స్' ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సమంత పోషించిన వైవిధ్యభరితమైన పాత్ర ..ఆమెకి ప్రశంసలు తెచ్చిపెట్టింది.

ఇక తెలుగులో ఆమె చేసిన 'మజిలీ' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. దాంతో సమంత క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఒక్కో సినిమాకి 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో సమంత అగ్రస్థానంలో కొనసాగుతుండటం వలన, ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదని చెప్పుకుంటున్నారు. 

More Telugu News