Telangana: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్, కేటీఆర్ లే కారణం.. వీరిద్దరిపై మర్డర్ కేసులు పెట్టాలి!: వీహెచ్

  • 19 మంది చనిపోయినా కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు
  • గ్లోబరినా యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి
  • హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో గోల్ మాల్ కారణంగా 19 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) తీవ్రంగా స్పందించారు. ఈ 19 మంది పిల్లలు చనిపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆరే కారణమని ఆయన ఆరోపించారు. వీరిద్దరిపై వెంటనే మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వీహెచ్ మాట్లాడారు.

రాష్ట్రంలో 19 మంది విద్యార్థులు చనిపోతే, సీఎం కేసీఆర్ ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని వీహెచ్ నిలదీశారు. ఈ విషయంలో కేటీఆర్ కూడా స్పందించకపోవడం నిజంగా బాధాకరమన్నారు. దీనికంతటికీ కారణమైన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలనీ, ఆయా కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

More Telugu News