allu arjun: రంగంలోకి దిగేసిన త్రివిక్రమ్, బన్నీ

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ
  • ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా
  •  కీలకమైన పాత్రలో 'టబు'

త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ప్రారంభించారు. హైదరాబాద్ .. బేగంపేట పోలీస్ లైన్స్ లో తొలి షెడ్యూల్ షూటింగును ఆరంభించారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక హాసిని వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

గతంలో తనకి 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి భారీ విజయాలను అందించిన కారణంగానే, త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసి మరీ ఆయనతో బన్నీ ఈ సినిమా చేస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని త్రివిక్రమ్ ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి మరి. ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో టబు .. బొమన్ ఇరాని .. జయరామ్ .. సుశాంత్ .. నవదీప్ కనిపించనున్న సంగతి తెలిసిందే.  

More Telugu News