నాగచైతన్య నవ్వులు.. సమంత స్టెప్పులు!

23-04-2019 Tue 21:59
  • హీరో వెంకటేశ్ కూతురు వివాహంలో సమంత ఫొటోలు
  • కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన వైనం
  • ఆసక్తికరంగా ఉన్న ఫొటోలు 
గత నెలలో ప్రముఖ హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత వివాహ వేడుకలు ఓ రేంజ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులతో పాటు పలు రంగాలకు చెందిన సెలెబ్రెటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు వెంకటేశ్ మేనల్లుడు నాగ చైతన్య, భార్య సమంత కూడా వెళ్లారు. అప్పుడు దిగిన ఫొటోలను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. నాగచైతన్యతో కలిసి ఉన్న ఓ ఫొటోలో సమంత స్టెప్పులేస్తున్న వైనం, వెంకటేశ్, ఆయన కూతుళ్లు, వాళ్లకు సంబంధించిన వ్యక్తులతో కలిసి ఉన్న మరో ఫొటో, బంధువర్గంతో ఉన్న ఇంకో ఫొటోను సమంత పోస్ట్ చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫొటోలపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేయడం గమనార్హం.