Telangana: పార్టీ ఫిరాయింపుదారులపై విజయశాంతి ఆగ్రహం!

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కష్టపడి గెలిపించాం
  • ఈరోజున టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారు
  • చెత్త అంతా పార్టీ నుంచి పోతోందన్న విజయశాంతి

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు దారులపై ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటి విజయశాంతి నిప్పులు చెరిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కష్టపడి గెలిపిస్తే, ఈ రోజున వాళ్లు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెత్త అంతా పార్టీ నుంచి పోతోంది’ అని కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. కొత్త రక్తం వస్తుందని, మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న పౌరుషం, కాంగ్రెస్ పార్టీ ‘బీ’ ఫామ్ తీసుకునేటప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఆమె స్పందిస్తూ, ఇందుకు కేసీఆర్ దే బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ స్పందించరా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ స్పందించడం మానేశారంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు బాధ్యతలు లేవని విమర్శించారు. 

More Telugu News