Chennai: టిక్‌టాక్ నిషేధంతో రోజుకు రూ.4.5 కోట్ల నష్టం

  • కంపెనీ ఆర్థిక మూలాలపై దెబ్బ
  • చిక్కుల్లో పడిన 250 మంది ఉద్యోగాలు
  • 24 లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశం

టిక్‌టాక్ యాప్‌పై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో టిక్‌టాక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ యాప్స్ నుంచి తొలగించారు. దీని కారణంగా కంపెనీ ఆర్థిక మూలాలపై తీవ్రంగా దెబ్బపడిందని టిక్‌టాక్ మాతృసంస్థ బైటెడెన్సన్ పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ సంస్థ తరుపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ టిక్‌టాక్ నిషేధం కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు.

ఈ నిషేధం వల్ల 250 మంది ఉద్యోగాలు చిక్కుల్లో పడ్డాయని, అలాగే నిషేధం విధించిన నాటి నుంచి రోజుకు రూ.4.5 కోట్లు నష్టపోయినట్టు పేర్కొన్నారు. ఈ తాత్కాలిక నిషేధంపై ఈ నెల 24 లోపు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే నిషేధాన్ని ఎత్తివేస్తామని మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు పేర్కొంది.  

More Telugu News