ఆనం రామనారాయణరెడ్డికి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

- టీటీడీ బంగారం తరలించిన వ్యవహారంపై దర్యాప్తా?
- ఆనం వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి
- ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తెలియని వాళ్లా బాబును విమర్శించేది!
ఆనం రామనారాయణరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలు ఇంతగా దిగజారి మాట్లాడటం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి, ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆనం, ఏ పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో ఆయనకు గుర్తు ఉండటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కూడా తెలియని వ్యక్తులు చంద్రబాబును విమర్శిస్తున్నారని, ఈసీనీ అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని, వ్యవస్థలను నాశనం చేయాలని ప్రయత్నం చేయొద్దని సూచించారు.