inter: ఇంటర్ అవకతవకలతో మాకు సంబంధం లేదు.. మేము పారదర్శకంగానే వ్యవహరించాం!: గ్లోబరినా సీఈవో రాజు

  • ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధం
  • మేం తక్కువ కోట్ చేశాం కాబట్టే టెండర్ దక్కింది
  • హైదరాబాద్ లో మీడియాతో వీఎస్ఎన్ రాజు

తెలంగాణలో ఇంటర్ ఫలితాల వ్యవహారంలో పెద్ద రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబరినా సంస్థ అధినేత, సీఈవో వీఎస్ఎన్ రాజు స్పందించారు. తెలంగాణ బోర్డు విడుదల చేసిన ఫలితాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము పారదర్శకంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకు ఆదేశించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. తాము టెండర్లు దక్కించుకోవడం వెనుక ఎలాంట రాజకీయ ఒత్తిళ్లు లేవని రాజు అన్నారు. మిగతా సంస్థల కంటే తక్కువ కోట్ చేశాం కాబట్టే టెండర్ తమకు దక్కిందని పేర్కొన్నారు. తమపై కాకినాడ జేఎన్టీయూ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. జేఎన్టీయూ తమకు ఇంకా కోట్లాది రూపాయలు చెల్లించాలన్నారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలని రాజు కోరారు.

More Telugu News