dubbing janaki: విశ్వనాథ్ గారి సినిమాలే నన్ను నిలబెట్టాయి: 'డబ్బింగ్' జానకి

  • అన్ని భాషల్లో కలుపుకుని 800 సినిమాలు చేసుండొచ్చు 
  • విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేసిన తొలి చిత్రం 'జీవనజ్యోతి'
  • 'సాగరసంగమం'లో తల్లిపాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది  

'డబ్బింగ్' జానకి 5 భాషల్లో 800కి పైగా సినిమాల్లో నటించారు. నటిగాను .. 'డబ్బింగ్' ఆర్టిస్ట్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను పోషించిన తల్లిపాత్రలను గురించి ప్రస్తావించారు. "కె. విశ్వనాథ్ గారి సినిమాల్లో వరుసగా తల్లి పాత్రలను పోషిస్తూ వచ్చాను. అయినా ఒకే తరహా పాత్రలను చేస్తున్నాననే ఆలోచన నాకు ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే విశ్వనాథ్ గారి స్కూల్ అలాంటిది.

 నన్ను నిలబెట్టినవే విశ్వనాథ్ గారి సినిమాలు. శోభన్ బాబు .. వాణిశ్రీ గారు కాంబినేషన్లో విశ్వనాథ్ గారు చేసిన 'జీవనజ్యోతి' సినిమాలో నాకు తొలిసారిగా అవకాశం వచ్చింది. 'శంకరాభరణం'లో చిన్న వేషమే అయినా మంచి పేరు వచ్చింది. 'సాగర సంగమం' సినిమాలో కమలహాసన్ కి తల్లిగా నేను చేసిన పాత్ర నన్ను నిలబెట్టేసింది. ఆ పాత్రలో చాలామంది తమ అమ్మలను చూసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టేసి .. తమ తల్లి కూడా నాలాగే ఉంటుందని చెప్పేవారు. అంతగా ఆ పాత్ర కదిలించగలిగింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News