Kerala: దటీజ్‌ పినరయి విజయన్‌...క్యూలో నిల్చుని ఓటేసిన కేరళ సీఎం!

  • కన్నూరు జిల్లా పినరయి పోలింగ్ బూత్‌లో ఓటు
  • సాధారణ పౌరుని మాదిరిగా ప్రజలతోపాటే
  • పలువురి అభినందన

సాధారణంగా వామపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నిరాడంబరంగా ఉంటారు. నిన్నటి తరం ప్రజాప్రతినిధులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ నిబంధనలతోపాటు వ్యక్తిగత క్రమశిక్షణ కూడా ఇందుకు కారణం. ఎంత పెద్ద పదవిలో ఉన్నా తామూ ప్రజల్లో భాగమన్న అభిప్రాయం వారిది. దీనికి చక్కని ఉదాహరణ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.

మూడో విడత పోలింగ్‌లో భాగంగా తన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన ఈరోజు ఓటేశారు. ఆయనకు ఓటు హక్కు ఉన్న కన్నూరు జిల్లాలోని పినరయిలోని ఆర్సీ అమల బేసిక్‌ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు విచ్చేశారు. భారీ క్యూ ఉన్నప్పటికీ సాధారణ పౌరుని మాదిరిగా క్యూలో నిల్చున్నారు. తనవంతు వచ్చినప్పుడు బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి నిరాడంబరత్వాన్ని పలువురు అభినందించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఈరోజు వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 116 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

More Telugu News