Hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్ లలో వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్!

  • ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం
  • పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
  • కూలిన చెట్లను తొలగించాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు

హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఈరోజు రాత్రి పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నేరేడ్ మెట్, న్యూబోయినపల్లి, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, రామాంతపూర్, నల్లకుంట, విద్యానగర్, తిలక్ నగర్, కుషాయి గూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, మలక్ పేట, మాదన్నపేట, సంతోష్ నగర్, వనస్థలిపురం, పాతబస్తీ, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్ పల్లి, జవహర్ నగర్, ముషీరాబాద్ చిలకలగూడ, బేగంపేట, బొల్లారం, తిరుమలగిరి, బోరబండ, మోతీనగర్, రాజీవ్ నగర్, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్ కూకట్ పల్లి, కేపీహెచ్బీకాలనీ, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద్ నగర్, మూసాపేట, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం, పటాన్ చెరువు, ఇస్నాపూర్,చింతల్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సూరారం, కాప్రా తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూలిపోయిన చెట్లను తొలగించి, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని తమ సిబ్బందిని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు.

More Telugu News