Telangana: ఇంటర్ ఫలితాల్లో పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్

  • పరీక్షా పేపర్ల మూల్యాంకనం పారదర్శకంగా జరిగింది
  • అనుమానాలకు ఆస్కారం లేదు
  • అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం

తెలంగాణలో ఇటీవల వెలువడ్డ ఇంటర్ మీడియట్ ఫలితాలు తప్పుడు తడకగా ఉన్నాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు. ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్ మీడియట్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని, ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

ఇంటర్ ఫలితాలపై వచ్చిన అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని, పారదర్శకంగా పని చేస్తున్నామని చెప్పారు. ముగ్గురు విద్యార్థుల మార్కులు సవరించినట్టు చెప్పారు. పొరపాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, వారికి మెమోతో పాటు జరిమానా కూడా విధిస్తామని అన్నారు. ఏ ఒక్క విద్యార్థి సమాధాన పత్రాలు గల్లంతు కాలేదని, జవాబు పత్రాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పరీక్షకు హాజరు కాని విద్యార్థులను ఉత్తీర్ణులను చేశామన్న వార్తలు, అదే విధంగా, హాజరైన విద్యార్థులను ఫెయిల్ చేశామంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

More Telugu News