lawrence: భారీ వసూళ్లతో తమిళనాట దూసుకుపోతోన్న 'కాంచన 3'

  • లారెన్స్ నుంచి 'కాంచన 3'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
  • తమిళనాట మూడు రోజుల్లో 30 కోట్లు      

హారర్ థ్రిల్లర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టేయడంలో లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన తాజా చిత్రంగా తమిళ .. తెలుగు భాషల్లో 'కాంచన 3' విడుదలైంది. ఈ నెల 19వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ రెండు భాషల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 రోజుల్లో 15.20 కోట్ల గ్రాస్ .. 9.13 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఇక తమిళనాట ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తమిళనాడులో ఈ సినిమా 3 రోజుల్లో 30 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. మూడు రోజుల వసూళ్ల విషయానికి సంబంధించి, రజనీ 'పేట' .. అజిత్ 'విశ్వాసం' తరువాత స్థానంలో ఈ సినిమా నిలిచిందని అంటున్నారు. ఈ హారర్ మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు.

More Telugu News